మానసికంగా దృఢంగా ఉండే వారు ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కొని బయటపడగలరని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడిపే దైవిక జ్ఞానమే అల్కేమి అని గవర్నర్ వ్యాఖ్యానించారు. గురుమిత్రె శివ స్థాపించిన మాతాంగి ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్కేమి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గౌలిదొడ్డిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆమె శనివారం ప్రారంభించారు.
కాస్మోటిక్ బ్యూటీ కంటే... కాస్మో ఎనర్జీ ఎంతో ముఖ్యం: గవర్నర్ - మాతాంగి ఫౌండేషన్ సమాచారం
కాస్మోటిక్ బ్యూటీ కంటే... కాస్మో ఎనర్జీ ఎంతో ముఖ్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో మాతాంగి ఫౌండేషన్ గురు మైత్రెశివ ఆధ్వర్యంలో అల్కేమి పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి మంచులక్ష్మి హాజరయ్యారు.
తనకు ఆధ్యాత్మికతపై ఎంతో ఆసక్తి ఉందని సినీ నటి మంచి లక్ష్మి అన్నారు. సామాన్యులు సైతం దైవిక జ్ఞానం అర్థం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చారు. పదేళ్లుగా దేశ, విదేశాల్లో అల్కేమి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు గురూజీ మైత్రె శివ తెలిపారు. ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపడానికి సహాయపడే దైవిక జ్ఞానాన్ని భోధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నెల 28,29 అల్కేమి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:Police recruitment: కానిస్టేబుల్ కొలువులకు పోటాపోటీ.. అత్యధిక పోస్టులు ఎక్కడంటే..!