తెలంగాణ

telangana

ETV Bharat / city

దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి అనిశా ప్రాథమిక నివేదిక - దుర్గగుడిలో సోదాలపై నేడు ప్రభుత్వానికి అ.ని.శా. నివేదిక

ఏపీలోని విజయవాడ దుర్గగుడిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఐదు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసి.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేశారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా 13 మందిని దేవదాయ శాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. తుది నివేదికను బట్టి కీలకమైన వ్యక్తులపైనా చర్యలు చేపట్టే అవకాశముంది.

దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి అనిశా ప్రాథమిక నివేదిక
దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి అనిశా ప్రాథమిక నివేదిక

By

Published : Feb 23, 2021, 1:08 PM IST

Updated : Feb 23, 2021, 1:23 PM IST

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అవినీతి నిరోధక శాఖ ఐదు రోజుల పాటు చేసిన తనిఖీల్లో.. అవినీతి, అక్రమాల డొంక కదిలింది. అనిశా అధికారులు దుర్గగుడిలోని కీలకమైన విభాగాలన్నింటిలోనూ లోతుగా పరిశీలించారు. కొండపై జరుగుతున్న లోపాలను గుర్తించి.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రసాదాల కౌంటర్ల దగ్గర నుంచి ప్రారంభించి.. పరిపాలనా విభాగం వరకూ తనిఖీలు చేశారు. చీరలు విభాగం, ఇంజినీరింగ్‌, సరకులు.. ఇలా అన్నింటికి సంబంధించిన దస్త్రాలను లోతుగా పరిశీలించారు. సెక్యూరిటీ, శానిటేషన్‌ టెండర్లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేశారు.

ఆలయానికి వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఉత్సవాలు, సిబ్బంది పదోన్నతులు.. ఇలా ప్రతి విషయాన్ని పరిశీలించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్క్రాప్‌ను కేవలం 40లక్షల రూపాయలకే విక్రయించినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఆలయంలోని కొంతమంది కీలక సిబ్బందిని గొల్లపూడిలోని అ.ని.శా. కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. అవకతవకలపై సంబంధిత సిబ్బందితో వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.

అనిశా ప్రాథమిక నివేదిక ఆధారంగా 13 మందిని సస్పెండ్‌ చేయాలంటూ దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు ఏడు విభాగాలకు చెందిన ఐదుగురు సూపరింటెండెంట్లు, ఎనిమిది మంది గుమస్తాలను దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు సస్పెండ్‌ చేశారు.

దర్శనం టికెట్ల విక్రయాల్లో రికార్డ్ అసిస్టెంట్లు కె. రమేష్, పి. రవికుమార్, ఫొటోల కౌంటర్‌ రికార్డు అసిస్టెంట్‌ పి.రాంబాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరించారు. వారిని పర్యవేక్షించలేదంటూ సూపరింటెండెంట్‌నూ సస్పెండ్‌ చేశారు. దుర్గగుడికి భారీ స్థాయిలో ఆదాయం వస్తుండగా.. కొందరు అధికారులు, గుత్తేదారులు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.94.54

Last Updated : Feb 23, 2021, 1:23 PM IST

For All Latest Updates

TAGGED:

acb taza

ABOUT THE AUTHOR

...view details