తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా టెస్ట్​: ‘ప్రైవేటు’లో రేట్లు తగ్గించిన ప్రభుత్వం

ప్రైవేటు ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షకు ‘ప్రైవేటు’లో రూ.2200 ఉండగా తాజాగా దాన్ని రూ.850కి తగ్గించారు. పరీక్ష సమయంలో వినియోగించే పీపీఈ కిట్‌, ఎన్‌ 95 మాస్కుల ధరలూ దాదాపు 90 శాతం తగ్గాయి.

government has significantly reduced the cost of Covid diagnostic tests
కరోనా టెస్ట్​: ‘ప్రైవేటు’లో రేట్లు తగ్గించిన ప్రభుత్వం

By

Published : Nov 19, 2020, 7:16 AM IST

ప్రైవేటు ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షకు ‘ప్రైవేటు’లో రూ.2200 ఉండగా తాజాగా దాన్ని రూ.850కి తగ్గించారు. అదేవిధంగా బాధితుల ఇంటికి వచ్చి తీసుకునే నమూనాకు రూ.2800 వసూలు చేస్తుండగా దాన్ని రూ.1200కు కుదించారు. ఈ ధరల్లోనే పీపీఈ కిట్‌, మాస్కు సహా అన్ని ఖర్చులు కలిసి ఉంటాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజారోగ్య సంచాకులకులు ప్రభుత్వానికి పంపించగా.. ఈ దస్త్రంపై బుధవారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆమోదముద్ర వేశారు. అనంతరం సంబంధిత జీవో విడుదలైంది.

గత మూణ్నెళ్లుగా కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల ధరలు దేశంలో తగ్గాయి. గతంలో ఒకట్రెండు సంస్థలు మాత్రమే ఉత్పత్తి చేసే కిట్లను ఇప్పుడు 180కి పైగా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో రూ.2వేలుండే పరీక్ష కిట్‌ ధర ఇప్పుడు రూ.250కే లభిస్తోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పరీక్ష సమయంలో వినియోగించే పీపీఈ కిట్‌, ఎన్‌ 95 మాస్కుల ధరలూ దాదాపు 90 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షకు రూ.950 కంటే ఎక్కువ తీసుకోవద్దని ఐసీఎంఆర్‌ కూడా ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల ధరల కుదింపుపై నిర్ణయం తీసుకున్నట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. అన్ని సర్కారు దవాఖానాల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చూడండి:కరోనా పంజా- దిల్లీలో 5లక్షలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details