తెలంగాణ

telangana

అన్​లాక్-4 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

By

Published : Sep 7, 2020, 6:41 PM IST

కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్​లాక్-4 మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది.

అన్​లాక్-4 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అన్​లాక్-4 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు తెరచుకునేందుకు అనుమతినిచ్చింది.

వంద మందికి మించకుండా..

100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.

ఇవీ చూడండి : దుబ్బాక తహసీల్దార్​ కారుకు అడ్డంగా పడుకొని నిరసన..

ABOUT THE AUTHOR

...view details