భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ సెలవు ప్రకటించారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. గులాబ్ తుపాన్ కారణంగా నిర్ణయం - తెలంగాణలో వర్షాలు
20:47 September 27
నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సి.ఎస్. ఆదేశించారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాలశాఖలు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వల్ల ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.
నీట మునిగిన హైదరాబాద్
గులాబ్ తుపాన్ (Gulab Cyclone) ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు (Hyderabad rains) కురుస్తున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, అమీర్‌పేట, రహమత్ నగర్, యూసఫ్‌గూడ శ్రీకృష్ణ నగర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకృష్ణనగర్ రహదారిపై నడుములోతు వరద నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వాన పడుతోంది. మాదాపూర్‌లో రహదారులు చెరువును తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్-హైటెక్‌సిటీ మార్గంలో 2 కి.మీ వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ సీవోడీ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వాహనాలను కేబుల్ బ్రిడ్జ్ మీదుగా మళ్లిస్తున్నారు. మాదాపూర్ అమర్ సొసైటీ, నెక్టార్ గార్డెన్ కాలనీల్లో భారీగా వరద వచ్చింది.
ఇదీ చూడండి:Gulab Cyclone effects on Hyderabad : రెండు గంటల వర్షం... నీట మునిగిన భాగ్యనగరం