తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో నవంబర్ 24న  ఫ్రీడమ్ 10కే రన్ - Hyderabad 10K Run - Register Today

భాగ్యనగరం నెక్లస్ రోడ్​లో నవంబర్ 24న ఫ్రీడమ్ 10కే రన్ నిర్వహిస్తున్నారు. ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. ఇక ఇప్పటికే రన్​లో పాల్గొనేందుకు పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్​లో నవంబర్ 24న  ఫ్రీడమ్ 10కే రన్ నిర్వహన

By

Published : Nov 9, 2019, 10:46 AM IST

హైదరాబాద్ నగరవాసులను 10కే రన్ మరోమారు పలకరించనుంది. నవంబర్ 24న నెక్లస్ రోడ్​లో ఫ్రీడమ్ 10కే రన్​ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత, హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ డైరక్టర్ డి.సురేష్ బాబు, టాలీవుడ్ నటుడు నిఖిల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. రన్​లో పాల్గొనేందుకు ఇప్పటికే పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. దాదాపు 16వేల మందికి పైగా రన్​లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 10కే రన్​తో పాటు.. 5కే రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసినవారికి మెడల్స్ అందించనున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: 'తొందరెందుకు... సోమవారం వరకు వేచిచూడండి'

ABOUT THE AUTHOR

...view details