తెలంగాణ

telangana

ETV Bharat / city

డ్రోన్ల ద్వారా ఔషధ సరఫరాకు ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ - తెలంగాణలో ప్లిప్​కార్ట్​

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, వ్యాక్సిన్లను తరలించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానకి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విధానం ద్వారా రానున్నరోజుల్లో ఆరోగ్య పరికరాలు, మందుల సరఫరాను విస్తృతంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

Prepare flipcart for delivery of goods by drones
డ్రోన్ల ద్వారా డెలివరీకి సిద్దమైన ప్లిప్​కార్ట్​

By

Published : Jun 12, 2021, 9:59 AM IST

రాష్ట్రలో డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్ డెలివరీ చేపట్టే పైలెట్ ప్రాజెక్టుకు ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కన్సార్టియం కుదుర్చుకోనున్నట్లు.... ఆ సంస్థ తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో అత్యవసర మందులు, వ్యాక్సిన్లను మారుమూల ప్రాంతాలకు చేరవేసేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కంపెనీ వెల్లడించింది.

జియో మ్యాపింగ్, ట్రాక్ అండ్ ట్రేస్ లొకేషన్, రూటింగ్ షిప్​మెంట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును సాకారం చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు. 'మెడిసిన్ ఫ్రం స్కై' ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని వివరించింది. డ్రోన్ల ద్వారా మందుల వితరణ ప్రభుత్వ ప్రాధాన్య విధానాల్లో ఒకటని, ఈ విధానం ద్వారా రానున్నరోజుల్లో ఆరోగ్య పరికరాలు, మందుల సరఫరాను విస్తృతంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికి మరో మల్టీమోడల్​ లాజిస్టిక్స్‌ పార్క్​.!

ABOUT THE AUTHOR

...view details