ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శిలోని శివరాజ్ నగర్‌కు చెందిన బత్తుల కిషోర్.. భవన నిర్మాణ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా రామన్నపేట గ్రామానికి పనుల కోసం వెళ్ళాడు. అక్కడ పరిచయమైన ఓ బాలికను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఆ బాలికను రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో నివసిస్తున్నాడు.
నమ్మించి 'వంచించాడు'.. దిశ కేసుతో జైలుపాలయ్యాడు! - ప్రకాశం జిల్లా నేర వార్తలు
ఏపీలోని ప్రకాశం జిల్లాలోని దిశ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. దర్శికి చెందిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నమ్మించి 'వంచించాడు'.. దిశ కేసుతో జైలుపాలయ్యాడు!
కొన్నిరోజుల అనంతరం ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కిషోర్ చేష్టలతో విసిగిపోయిన బాలిక.. పోలీసును ఆశ్రయించింది. ఎస్పి ఆదేశాలతో స్థానిక దిశ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి:మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!