Tree Anniversary: హైదరాబాద్‌లో 2020 సంవత్సరంలో గాలి వాన సృష్టించిన బీభత్సానికి... జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు వాకర్స్ ఏరియాలో.... పిల్లోఫారమ్ జాతికి చెందిన 25ఏళ్ల వయసున్న భారీ చెట్టు కూలిపోయింది. ఆ దారిలో రోజూ వాకింగ్ చేసే ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎండీ విజయసాయి వృక్షాన్ని గమనించారు. చెట్లను ట్సాన్స్‌ప్లాంట్ చేసే వాటా ఫౌండేషన్, జీహెచ్ఎంసీతో కలిసి 2021 ఫిబ్రవరి 26న మళ్లీ నాటించారు. ఆ వృక్షం పునర్జన్మ పొందిన శనివారానికి.. ఏడాది కావడంతో వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్... రాష్ట్రంలో పచ్చదనం కాపాడుకోవడానికి అంతా కృషి చేయాలని కోరారు.
Tree Anniversary: చెట్టుకు ఘనంగా మొదటి వార్షికోత్సవం.. కల్పవృక్షంగా నామకరణం..
Tree Anniversary: పుట్టిన రోజులు.. వివాహ వార్షికోత్సవాలు... కార్యాలయాల వార్షికోత్సవాలు జరుపుకోవడం సర్వసాధారణం. కానీ హైదరాబాద్‌లో చెట్టుకు వార్షికోత్సవం నిర్వహించారు. 25ఏళ్ల వయసున్న చెట్టు ఏడాది క్రితం కూలిపోతే.... రిప్లాంటేషన్ ద్వారా పునర్జన్మ అందించారు. చెట్టుకు పునర్జన్మ వచ్చి సంవత్సరం కావడంతో... ఘనంగా వేడుకలు నిర్వహించి... కల్పవృక్షంగా నామకరణం చేశారు.
the-first-anniversary-to-the-tree-and-named-as-kalpavriksham
భవిష్యత్తులో చెట్టుకు మళ్లీ నష్టం కలగకుండా ఉండేందుకు 5 అడుగుల లోతులో పాతిపెట్టినట్లు ఎస్ అండ్ ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎండీ విజయసాయి తెలిపారు. హైదరాబాదులో 15 ఏళ్ల కిందట తొలిసారి ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందని.. అప్పుడు తాము నాటిన చెట్లు... బాగా పెరిగి స్థానికులకు ఆహ్లాదం పంచుతున్నాయని వాటా ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: