కడపలోని ప్రముఖ పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా) ఉర్సు ఉత్సవాలను ఈ ఏడాది కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. దర్గాను దర్శించుకొనున్నారు. ఉరుసులో భాగంగా సోమవారం రాత్రి.. పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరిఫుల్లా హుసేని గంధం సమర్పించారు.
నిరాడంబరంగా కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు - కడప పెద్ద దర్గా తాజా సమాచారం
ఏపీలో ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరిఫుల్లా హుసేని గంధం సమర్పించారు.
నిరాడంబరంగా కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు
ఫకీర్ల విన్యాసంతో పాటు బ్యాండ్ మేళాలతో గంధం కార్యక్రమం కొనసాగింది. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి గంధం సమర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో భక్తులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ.. స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవీచూడండి:గ్రేటర్ పరిధిలో ప్రత్యేక బృందాలు.. మాదక ద్రవ్యాలకు చెక్!