రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ పేరును నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి మోదీ ప్రభుత్వం పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. ఈ విషయమై.. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల, తెగల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ సర్వేని ఆయన నివాసంలో కలిశారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం నూతన పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలనే విషయమై ఆయనతో చర్చించారు.
ప్రపంచంలోనే..
దేశానికి ప్రపంచంలోనే అత్యోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అని పేర్కొన్న సర్వే.. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించారన్నారు. పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని కోట్ల మంది ప్రజల డిమాండ్ అని చెప్పారు.