మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఈ స్థానానికి మొత్తం 81 నామపత్రాలు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్‌కు నేడు తుది గడువు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు.
ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. 26 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఓటింగ్‌ను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరపనున్నారు.
మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి 5.60 లక్షల మంది ఓటర్లు.. 616 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల డీఆర్సీ కేంద్రంగా హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియాన్ని ఎంపిక చేశారు.
- ఇదీ చూడండి :తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి నామినేషన్