అనారోగ్యంతో పనిచేయని స్థితిలో ఉన్న పాత్రికేయులు జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఈనెల 18లోగా అర్హతగలవారు దరఖాస్తులు పంపాలని తెలిపారు. మృతి చెందిన పాత్రికేయులు కుటుంబ సభ్యులు, పాత్రికేయ వృత్తిలో ఉంటూ... అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జర్నలిస్టుల సంక్షేమనిధి దరఖాస్తుకు ఈనెల 18వరకు గడువు - జర్నలిస్టుల సంక్షేమనిధి దరఖాస్తు గడువు
జర్నలిస్టుల సంక్షేమనిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సాయం కోసం అర్హతగలవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 18తో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమనిధి దరఖాస్తుకు ఈనెల 18వరకు గడువు
గతంలో లబ్ధి పొందిన వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మరలా చేయొద్దని తెలిపారు. సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను.... స్వయంగా గాని, పోస్ట్ ద్వారా గాని ఈ నెల 18లోగా సమర్పించాలన్నారు.
ఇదీ చూడండి:వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి.. మేయర్, కార్పొరేటర్లతో సీఎం