కబ్జాలకు గురవుతున్నా దేవాలయాల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు ముట్టడించారు. లలితాబాగ్ కాళికామాత గుడి స్థలాలను కాపాడింది సీపీఐ అని గుర్తుచేశారు. గుడి స్థలాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. వివాదాస్పదంగా మారుతున్న కాళికామాతా దేవాలయానికి సంబంధించిన 7ఎకరాల 30 గుంటల స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'లలితాబాగ్ కాళికామాత గుడి స్థలాన్ని కాపాడ్డానికి ఎంతకైనా తెగిస్తాం' - telangana news
దేవాలయాల భూములను కబ్జాల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు ముట్టడించారు. లలితాబాగ్ కాళికామాత గుడి స్థలాన్ని కాపాడడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు.
లలితాబాగ్ కాళికామాత గుడి స్థలాన్ని కాపాడ్డానికి ఎంతకైనా తెగిస్తాం..
ర్యాలీగా వెళుతున్న నాయకులను రాంకోఠిలో పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం వైపు దూసుకుపోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన కోట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తుంటే... దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:కానిస్టేబుల్‌తో మహిళా ఎస్సై సాన్నిహిత్యం...!