రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నమోదైన కేసు వీగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని 2018 లో కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504, 505, 506 సెక్షన్ల కింద బండి సంజయ్‌పై నమోదైన కేసును హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం విచారణ చేపట్టింది.
బండి సంజయ్‌పై ఉన్న కేసును కొట్టేసిన కోర్టు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని 2018లో బండి సంజయ్‌పై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. పోలీసుల అభియోగాలపై తగిన ఆధారాలు లేకపోవడం వల్ల కేసును కొట్టేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
Breaking News
పోలీసుల అభియోగాలపై తగిన ఆధారాలు లేకపోవడం వల్ల కేసును న్యాయస్థానం కొట్టేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో వేర్వేరు కేసుల్లో బండి సంజయ్, రాజాసింగ్, సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకున్న దేత్తడి హారిక