Baby boy Died: గాలిపటం ఎగరేస్తూ సెప్టిక్‌ట్యాంక్‌లో జారిపడి చిన్నారి మృతి - హైదరాబాద్ వార్తలు
12:01 October 20
గాలిపటం ఎగరేస్తూ సెప్టిక్‌ట్యాంక్‌లో జారిపడి చిన్నారి మృతి
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు అరవింద్ మృతి చెందాడు. పాపిరెడ్డి కాలనీలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మరణించాడు. నిన్నటి నుంచి బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు.
ఇవాళ ఉదయం సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్న బాలుడిని గమనించిన స్థానికులు...పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి మృతదేహన్ని బయటకు తీసి.. పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.
ఇవీచూడండి:Baby Girl Died in BommalaRamaram : నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి