రాష్ట్రానికి రూ.179 కోట్లు మంజూరు చేసిన కేంద్రం - తెలంగాణ మూలధన వ్యయం
12:00 January 30
రాష్ట్రానికి రూ.179 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
మూలధన వ్యయానికి సంబంధించి రాష్రానికి అదనంగా నిధులు కేటాయించింది కేంద్రం. నిర్దేశించిన సంస్కరణలను పూర్తి చేసినందున రాష్ట్రానికి రూ.179 కోట్లు మంజూరు చేసింది. కేంద్రం ప్రతిపాదించిన నాలుగు సంస్కరణలకు గానూ.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణాభివృద్ధిలో సంస్కరణలు పూర్తి చేసిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అందుకు ప్రోత్సాహకంగా అదనపు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. రూ.179 కోట్ల అదనపు ప్రోత్సాహక నిధులలో మొదటి వాయిదా కింద రూ.89.50 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
ఇవీ చూడండి:'శాకాహారుల్లో కరోనా ప్రభావం తక్కువ'