విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని కేంద్రం వెల్లడించింది. రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్) నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. తొలుత తెలంగాణ డిస్కంలు రూ.1360 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ విద్యుత్తు కొనుగోలు చేయకుండా అడ్డుకుంది. ఆ తరువాత ఈ బకాయిలు రూ.52.85 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ నిషేధాన్ని కొనసాగించింది. చెల్లించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల బకాయిలపై గందరగోళం నెలకొంది.
పాతబాకీలు ఏమీ లేవు, విద్యుత్తు కొనుగోలుకు ఓకే అన్న కేంద్రం
గత రెండు రోజులుగా భారత ఇంధన ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్) నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకుండా విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. విద్యుదుత్పత్తి సంస్థలకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన పాత బకాయిలు లేవని వెల్లడించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
శనివారం చెల్లించాల్సిన పాత బకాయిలు ఏమీ లేవని తెలిపింది. ఈ మేరకు ఐఈఎక్స్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని తెలంగాణతో పాటు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. దీంతో శనివారం తెలంగాణ డిస్కంలు ఐఈఎక్స్ నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్ శనివారం 11,524 మెగావాట్లకు తగ్గింది. కేంద్ర నిషేధంతో పాటు విద్యుత్తు లోటుతో రెండు రోజులు ఇబ్బందులు వస్తాయని భావించినా, డిమాండ్ తగ్గడంతో పాటు కేంద్రం అనుమతించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇవీ చదవండి: