తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2020, 5:22 PM IST

ETV Bharat / city

తీవ్రస్థాయి కొవిడ్‌ లక్షణాలకు ఇవే కారణం

కరోనా బాధితుల రక్తంలో ఐఎల్‌-6, డి-డిమర్, సీఆర్‌పీ, ఎల్‌డీహెచ్, ఫెరిటిన్‌ అనే బయోమార్కర్ల స్థాయి ఎక్కువగా ఉండటం వల్లే తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు, మరణాల ముప్పు పెరుగుతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.

five reasons to died people with corona
తీవ్రస్థాయి కొవిడ్‌ లక్షణాలకు ఇవే కారణం

కొవిడ్‌-19 బాధితుల్లో తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలకు, వారిలో మరణాల ముప్పును పెంచడానికి రక్తంలో ఐదు సూచీలే ప్రధాన కారణమవుతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మెరుగైన అంచనాలు వేయడానికి వైద్యులకు ఇవి వీలు కల్పిస్తాయని తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన 299 మందిని జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ ఆసుపత్రి శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరిలో 200 మంది రక్తంలో ఐఎల్‌-6, డి-డిమర్, సీఆర్‌పీ, ఎల్‌డీహెచ్, ఫెరిటిన్‌ అనే బయోమార్కర్ల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటి స్థాయి పెరిగితే ఇన్‌ఫ్లమేషన్, రక్తస్రావం రుగ్మతలు తలెత్తుతుంటాయి. లీటరు రక్తంలో ఎల్‌డీహెచ్‌ స్థాయి 1200 యూనిట్లు, డి-డిమర్‌ స్థాయి.. మిల్లీలీటరుకు మూడు మైక్రోగ్రాముల కన్నా ఎక్కువైతే మరణం ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ బయోమార్కర్లపై విశ్లేషణ ఆధారంగా కొవిడ్‌ బాధితుల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం పొంచి ఉన్నవారిని ముందే గుర్తించొచ్చని పరిశోధనకు నాయకత్వం వహించిన శాంత్‌ అయనియన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి వారిని వయసు, కొన్ని రకాల దీర్ఘకాల రుగ్మతలు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం, ఊబకాయం, గుండె జబ్బు వంటి లక్షణాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇందుకు భిన్నంగా రక్తంలోని బయోమార్కర్ల ఆధారంగా ముందే గుర్తిస్తే.. చికిత్స ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బాధితుడిని డిశ్ఛార్జి చేయాలా, ఇంటికి పంపేశాక అతడిని ఎలా పర్యవేక్షించాలి వంటి అంశాలపై వైద్యులు ఒక నిర్ణయానికి రావొచ్చని చెప్పారు.

ఇవీ చూడండి:తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు, 14 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details