AP capital not visible in Indian map: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుసక్తం చివర్లో ముద్రించిన భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా.. ఏపీకి మాత్రం రాజధాని పేరు ఇవ్వలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి వదిలేశారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
భారతదేశ పటంలో కనిపించని ఆంధ్రప్రదేశ్ రాజధాని.. - తెలంగాణ టాప్ న్యూస్
AP capital not visible in Indian map: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుసక్తం చివర్లో ముద్రించిన భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని పేరు ఇవ్వలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి వదిలేశారు.
భారతదేశ పటంలో కనిపించని ఆంధ్రప్రదేశ్ రాజధాని..
భారతదేశ పటం చూపిస్తూ విద్యార్థులకు రాష్ట్రాలు, రాజధానులు పేర్లు చెప్పే సమయంలో ఏపీ రాష్ట్ర రాజధాని ఏమని చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఆ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ద్విభాషా పుస్తకాలను తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించి ముద్రించారు. రెండో సెమిస్టర్ పాఠ్య పుస్తకం చివరిలో భారతదేశ పటాన్ని ఇచ్చారు.