తెలంగాణ

telangana

'పౌర చట్టం ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు'

By

Published : Dec 22, 2019, 11:08 PM IST

హైదరాబాద్​ కాచిగూడ జాగృతి భవనంలో తెలంగాణ విశ్వ హిందూ పరిషత్  ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సమావేశం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేశ్​ పలువురు విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

the-caa-bill-is-not-opposed-to-any-single-category
"సీఏఏ బిల్లు ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు"

పాకిస్థాన్, బంగ్లాదేశ్​లో హిందువులను ఉచకోత కొస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ ఆందోళ వ్యక్తం చేశారు. హైదరాబాద్​ కాచిగూడ జాగృతి భవనంలో తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేశ్​ పలువురు విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఒవైసీ ముస్లింలకు చేసిందేమి లేదు

ప్రతిపక్షాలు సీఏఏపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని.. వారి బెదిరింపులకు భాజపా ప్రభుత్వం బయపడదని సురేంద్ర జైన్ అన్నారు. సోనియా, ప్రియాంక గాంధీలు దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్ని ఆందోళనలు చేస్తున్నాయని.. సీఏఏ బిల్లు ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. ముస్లిం నాయకున్ని అంటున్న ఒవైసీ ముస్లింలకు చేసిందేమి లేదని.. వారిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

'పౌర చట్టం ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకం కాదు'

ఇవీ చూడండి: 'పౌర' సెగ: 3లక్షల మందితో గహ్లోత్​ భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details