తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganesh Chaturthi: కాణిపాకంలో వైభవంగా వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ఆరంభం - తెలంగాణ వార్తలు

ఏపీలోని చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కొవిడ్(covid)​ నిబంధనలను అనుసరిస్తూ.. ఈ నెల 19 వరకు వేడుకలను నిర్వహిస్తారు. ఇందులో తొలి రోజు వినాయక చవితి పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Ganesh Chaturthi brahmotsavam, Ganesh Chaturthi in srisailam
కాణిపాకంలో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 10, 2021, 3:33 PM IST

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కరోనా(corona) దృష్ట్యా ఏకాంతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు వినాయక చవితి(ganesh chaturthi) పురస్కరించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవలను జరపనున్నారు.

అలాగే ఈ నెల

  • 12న నెమలి, 13న మూషిక, 14న శేషవాహన సేవలు
  • 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ సేవలు
  • 16న గజ సేవ, 17న రథోత్సవం
  • 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ
  • 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయత్తు ఉత్సవంతో పాటు ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీశైలంలో నవరాత్రి మహోత్సవాలు

శ్రీశైలంలోనూ గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఈవో లవన్న, అర్చకులు ఉత్సవ పూజలు ప్రారంభించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద మృత్తిక గణపతి ఏర్పాటు చేశారు. సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప పూర్వక పూజలు నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి.

కాణిపాకంలో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి:Kishan reddy: 'సమస్యలు పరిష్కరించే శక్తి ఇవ్వాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details