సీలేరు నదిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు.. మరో నలుగురు..! - సీలేరు నదిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు.. మరో నలుగురు..!
09:12 March 28
సీలేరు నదిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు.. మరో నలుగురు..!
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లోని సీలేరు నదిలో పడప బోల్తాపడి ఇద్దరు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ మంగంపాడుకు చెందిన ఇద్దరు, మర్రిగూడెంకు చెందిన ఇద్దరు, తెలుగు క్యాంపుకు చెందిన ఇద్దరు మొత్తం ఆరుగురు గిరిజనులు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా గిల్లమడుగు నుంచి నాటుపడవపై తెలుగుక్యాంపు రేవుకు వస్తుండగా, మార్గమద్యలో పడవ అదుపుతప్పింది.
ఈ క్రమంలో పడవలో ఉన్నవారు ప్రాణాలను రక్షించుకోవడానికి నదిలో దూకేశారు. ఇందులో మంగంపాడుకు చెందిన లక్ష్మయ్య, తెలుగు క్యాంపునకు చెందిన లింగారెడ్డిలు గల్లంతయ్యారు. మిగిలిన వారు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: Young Woman Rape : ఉద్యోగమిస్తానని నమ్మించి యువతిపై అత్యాచారం