తెలంగాణ

telangana

ETV Bharat / city

చలో అమలాపురానికి ఏపీ భాజపా పిలుపు.. ఎక్కడికక్కడ నేతల నిర్బంధం - chalo amalapuram news

హిందూ ఆలయాల‌పై దాడులు, అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ... భాజపా తలపెట్టినల చలో అమలాపురం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి గృహనిర్బంధాలు, అరెస్టులతో అమలాపురం ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీరుపై భాజపా శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

the-bjp-has-called-for-a-chalo-amalapuram-program
చలో అమలాపురానికి ఏపీ భాజపా పిలుపు

By

Published : Sep 18, 2020, 12:30 PM IST

అంతర్వేది ఘటన దృష్ట్యా చలో అమలాపురం కార్యక్రమానికి భాజపా పిలుపు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అమలాపురంలో 500 మంది పోలీసులతో ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్​ రావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ ఆలయాల‌పై దాడుల‌ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరనగా భాజపా ఆందోళనకు దిగింది. హిందూ‌వాదులను అక్రమంగా అరెస్టులు‌ చేశారంటూ చలో అమలాపురానికి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు.

కోనసీమలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని... అమలాపురంలో 144 సెక్షన్​ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ఇతర ప్రాంతం వారిని ఎవరినీ అమలాపురం వచ్చేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏలూరులో అంబికా కృష్ణ వంటి ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేశారు. విజయనగరం, శ్రీకాకుళం సహా పలు జిల్లాల అధ్యక్షులను పోలీసులు అడ్డుకున్నారు.

నిన్నటి నుంచి భాజపా నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తాడేపల్లి కరకట్ట వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గృహ నిర్బంధం చేశారు. ఆయన్ని విడుదల చేయాలంటూ భాజపానేతలు ధర్నా చేపట్టారు. సోము వీర్రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా... చలో అమలాపురం జరిగి తీరుతుందని సోము‌ వీర్రాజు ప్రకటించడంతో.. పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, భాజాపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడు లో భాజపా నాయకురాలు, మాజీకేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నిర్బంధం కొనసాగుతుండగానే... భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ ప్రకటన కలకలం రేపింది. తాను అలాపురంలోనే ఉన్నానని... అనుకున్న సమయానికి నిరసన ప్రదేశానికి చేరుకుంటానని ప్రకటించారు. ఆయన ఉండే ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనతోపాటు అమలాపురం వచ్చిన యామిని శర్మ, సూర్యనారాయణరాజు సహా పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని అంబాజీపేట పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details