తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం! - Telangana New Revenue Act latest news

రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంను సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ పనితీరుపై కొద్దికాలంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, ఆ శాఖలో అవినీతి లేకుండా చేస్తానని ప్రకటించారు. తాజా పరిణామాలే దీనికి ఊతమిస్తున్నాయి.

The Assembly is moving forward New Revenue Act in these meetings
ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!

By

Published : Aug 26, 2020, 4:13 AM IST

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ద్వారా పరిపాలన సజావుగా సాగటంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, పురపాలక చట్టాలను తీసుకొచ్చింది. కొత్త చట్టాలతో ప్రజాప్రతినిధులు, అధికారుల్లో బాధ్యతలతో పాటు జవాబుదారీతనం పెరిగిందని, ఆ దిశగా ఫలితాలు కూడా ఉన్నాయన్నది ప్రభుత్వ అభిప్రాయం. అదే తరహాలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది.

లొసుగులతో అవినీతికి ఆస్కారం

రెవెన్యూ అధికారులకు ఉన్న విచక్షణాధికారాలు, ప్రస్తుతం ఉన్న లొసుగుల కారణంగా రెవెన్యూ శాఖలో అవినీతికి బాగా ఆస్కారం ఉందన్నది ప్రభుత్వ అభిప్రాయం. అందుకే చాలా చోట్ల రెవెన్యూ శాఖలో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. అవినీతి నిరోధక శాఖకు వచ్చే ఫిర్యాదుల్లోనూ ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇటీవల జరిగిన ఉదంతాలు అదే తరహాలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ తర్వాత కూడా రైతులు చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటి నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

సాంకేతికతకు పట్టం

వచ్చే నెల ఏడో తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి పారదర్శకంగా ప్రజలకు సేవలు అందే విధానాన్ని అమల్లోకి తేవాలని, అధికారుల్లో జవాబుదారీతనం రావాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. వీలైనంత వరకు మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆన్​ లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

ఇవీ చూడండి:సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు

ABOUT THE AUTHOR

...view details