దసరా ఉత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అంతేకాక రాష్ట్రంలో దసరా ఉత్సవాలపై శుభవార్త అందించారు. ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
'కొవిడ్ నిబంధనలకు లోబడే ఏపీలో దసరా ఉత్సవాలు' - దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Dussehra celebrations
విజయవాడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు మంత్రి. భక్తుల కోసం అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొండచరియలు జారకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:AP CM Jagan about swechha program: 'బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం'