తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికల వేళ ఐఏఎస్​ల బదిలీ, పోస్టింగ్​లలో మార్పులు - ఏపీ పంచాయతీ ఎన్నికల వార్తలు

ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్​గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్​ను నియమిస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల వేళ ఐఏఎస్​ల బదిలీ, పోస్టింగ్​లలో మార్పులు
ఎన్నికల వేళ ఐఏఎస్​ల బదిలీ, పోస్టింగ్​లలో మార్పులు

By

Published : Feb 3, 2021, 8:04 PM IST

ఏపీ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు కలెక్టర్​గా ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్​ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాఖలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగానూ, అలాగే ఎక్సైజ్​ శాఖ కమిషనర్ అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్​ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు ఎక్సైజ్​ శాఖ కమిషనర్ బాధ్యతల్ని.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్​కు అప్పగించారు. అలాగే పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ బాధ్యతల్ని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మికి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇక అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఉన్న జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్​కు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇదీ చదవండి:రాజకీయ ప్రయోజనాల కోసమే కేసులో ఇరికించారు: భార్గవ్​రామ్

ABOUT THE AUTHOR

...view details