తెలంగాణ

telangana

ETV Bharat / city

'అరెస్ట్​లకు నిరసనగా డిపోల ఎదుట రేపు నిరసన కార్యక్రమాలు' - tsrtc strike latest updates

ఆర్టీసీ ఐకాస నేతల అరెస్టులను వామపక్ష పార్టీలు ఖండించాయి. నిర్బంధాలకు నిరసనగా రేపు అన్ని డిపోలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

ఐకాస నేతల అరెస్టులను ఖండించిన వామపక్షాలు

By

Published : Nov 16, 2019, 8:16 PM IST

Updated : Nov 16, 2019, 10:12 PM IST

ఆర్టీసీ ఐకాస నేతల అక్రమ అరెస్టులను వామపక్ష పార్టీల తరఫున ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆర్టీసీ ఐకాస నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు అన్ని డిపోలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తూ ఆర్టీసీ ఐకాస నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ విభజన జరగలేదని చెబుతున్న కేంద్రం... ఆర్టీసీ సమ్మెపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన భాజపాదంతా ఒక నాటకమని విమర్శించారు.

ఐకాస నేతల అరెస్టులను ఖండించిన వామపక్షాలు

ఇవీ చూడండి: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్

Last Updated : Nov 16, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details