అశ్వత్థామరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని టీఎంయూ నేత థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ ఉందన్నప్పుడు భయమెందుకని.. తమవాళ్లకు ఎందుకు ఫోన్ చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో హైదరాబాద్‌లో పెద్దఎత్తున సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. తాము మొదటి నుంచి కార్మికుల పక్షానే ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రధాన కార్యదర్శి పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి: థామస్‌రెడ్డి - thamasos reddy demands ashwathama reddy resignation
ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూలో చీలిక దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మికుల సంక్షేమం పట్ల శ్రద్ధలేని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని మరోనేత థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ సభలో తమ సత్తా ఎంతో చూపిస్తామన్నారు.
ప్రధాన కార్యదర్శి పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయాలి: థామస్‌రెడ్డి
కరోనా వచ్చినా పట్టించుకోలేదని.. కండక్టర్ల జాబ్ సెక్యూరిటీ ఇవ్వడంలో అశ్వత్థామరెడ్డి విఫలమయ్యారని థామస్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. నల్గొండ సభలో తమ సత్తా ఎంతో చూపిస్తామని స్పష్టం చేశారు.
ఇవీచూడండి:ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ.. ఆర్టీసీకీ నష్టం చేశారు: థామస్‌రెడ్డి