కరుణ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి పరిశుభ్రతే ప్రధాన మార్గమని శాసనసభ్యుడు ముఠా గోపాల్ బెస్త అన్నారు. ముషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తలసాని సాయికుమార్ అందించిన శానిటైజర్ల బాటిళ్లను ప్రజలు, కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో తెరాస యువనేత తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు.
శానిటైజర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త - శానిటైజర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
కరోనా రాకుండా అడ్డుకోవడంలో శుభ్రతే ప్రధాన మార్గం అన్నారు ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త. ముషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తలసాని సాయికిరణ్‌తో కలిసి ఆయన శానిటైజర్లు పంపిణీ చేశారు.

శానిటైజర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త
ప్రజలకు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, తలసాని సాయికిరణ్ శానిటైజర్ బాటిళ్లను పంచారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించేందుకు యువత అడుగు ముందుకు వేయాలని కోరారు.
శానిటైజర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త
Last Updated : Mar 30, 2020, 9:06 PM IST