తెలంగాణ

telangana

ETV Bharat / city

హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరాషేక్​ విడుదల... మళ్లీ అరెస్ట్

By

Published : Jan 2, 2020, 6:56 PM IST

Updated : Jan 2, 2020, 8:03 PM IST

నౌహీర షేక్​ను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు
నౌహీర షేక్​ను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు

18:48 January 02


హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్​ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన వెంటనే మహారాష్ట్ర పోలీసులు పీటీ వారెంట్ పై ఆమెను మహారాష్ట్రకు తరలించారు. బంగారంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ చెల్లిస్తానని ఆశ చూపిన నౌహీరా షేక్.. భారీగా డిపాజిట్లు సేకరించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంవల్ల ఆమెపై సీసీఎస్​లో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు సుమారు లక్షా 25వేల మంది నుంచి రూ.6వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు నిర్ధారించారు. 
 

విడుదల... అరెస్ట్..

నౌహీరాను అరెస్ట్ చేసి చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం వల్ల.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తనపై నమోదైన కేసులన్నీ పోలీస్ స్టేషన్ల వారీగా కాకుండా తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న నౌహీరా షేక్ వినతిని ధర్మాసనం అంగీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం బెయిల్ పై బయటికి వచ్చిన వెంటనే మహారాష్ట్ర పోలీసులు.. అక్కడ నమోదైన కేసులో భాగంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.  
 

ఎక్కడెక్కడ కేసులున్నాయంటే..?

హీరా గ్రూప్స్ పేరిట నౌహీరా షేక్ తెలంగాణ, మహారాష్ట్రలోనే కాక.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, దిల్లీలోనూ మోసాలకు పాల్పడ్డారు.. ఆయా రాష్ట్రాల్లోనూ నౌహీరాపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు తేలడంతో ఈడీ కూడా నౌహీరా షేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చూడండి: 'సచివాలయ నిర్మాణంపై ఈనెల 7లోపు పూర్తి వివరాలివ్వండి'

Last Updated : Jan 2, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details