ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద భద్రతా సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వహించిన అధికారులు.. ఆ ఫలితాలను ఈ రోజు వెల్లడించారు.
తాజా కేసులతో ఏపీ సీఎం కార్యాలయం వద్ద కరోనా కలకలం మొదలైంది. గతంలోనూ సీఎం నివాసం వద్ద ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. తాజగా కరోనా బారినపడిన ఎనిమిది మంది కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు.