తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ: కరోనా పాఠం.. మిద్దె పంటే ఆధారం - డాబాపై మెక్కలు పెంపకం

కరోనా భయంతో ఆరోగ్యానికి ప్రజలిచ్చే ప్రాధాన్యం పెరిగింది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు బయట ఆహారాన్ని దూరం పెడుతుంటే, మరికొందరు సొంతంగా కూరగాయలను పండిస్తున్నారు. ఖాళీ స్థలంతో సంబంధం లేకుండా ఇంటి పైన ఉన్న కొద్దిపాటి జాగాలో రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో ఓ వైద్యుడు ఇలానే టెర్రస్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి స్వయం ఫలసాయం పొందుతున్నారు.

కరోనా పాఠం.. మిద్దె పంటే ఆధారం
కరోనా పాఠం.. మిద్దె పంటే ఆధారం

By

Published : Oct 19, 2020, 6:43 PM IST

ఏపీలోని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ నుంచి వాంబేకాలనీకి వెళ్ళే రహదారీలో.. దాలిపర్తి రాంబాబు అనే ఆర్ఎంపీ వైద్యుడు నివాసం ఉంటున్నారు. కరోనా వేళ విధించిన లాక్‌డౌన్‌తో అందరిలానే అతనూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలోనే, పెరటి సాగును ప్రారంభించాడు. దానికి ఇంటి మేడపైన ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. అప్పటికే ఉన్న పద్ధతులను అన్వేషించారు. వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూర మెక్కలని క్రమపద్ధతిలో పెంచారు.

ఇంట్లో ఖాళీగా ఉన్న భార్య, పిల్లలు కూడా చేయి కలిపారు. ఇప్పుడు పలు రకాల కూరగాయలతో పాటు.. అనేక ఫలాల మొక్కలను సైతం రాంబాబు కుటుంబం పెంచుతున్నారు. రసాయనాలు వాడకుండా కేవలం కంపోస్టు ఎరువుతోనే పెరట్లోని మొక్కలను పెంచుతున్నానంటున్న రాంబాబు.. స్వయం ఫలసాయంతో పాటు మెక్కలపై ఉన్న మమకారం కూడా తీరుతోందని చెబుతున్నారు. భార్యతో పాటు పిల్లలూ తమవంతు సహకారం అందిస్తున్నారని అంటున్నారు.

పండించిన కూరగాయలు, ఫలాలను తమతో పాటు తమ స్నేహితులకు కూడా పంచుతున్నామంటున్న రాంబాబు.. కరోనా వేళ ఆరోగ్యానికి మరింత ఉపకరిస్తుందని చెబుతున్నాడు.

కరోనా పాఠం.. మిద్దె పంటే ఆధారం

ఇదీ చదవండి: అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

ABOUT THE AUTHOR

...view details