ఉదయం నుంచి శాంతియుతంగా సాగిన ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్ వైపు కార్మికులు, విపక్ష నేతలు పరుగులు తీశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికి బారికేడ్లను తోసుకుని ఫ్లైఓవర్ కిందకు దూసుకొచ్చారు. అకస్మాత్తుగా సీపీఎం శ్రేణులు ఎంబీభవన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చారు. నలువైపుల నుంచి ఆందోళనకారులు చొచ్చుకురావటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బలగాలు తక్కువగా ఉండటం, రాజకీయ నేతలు , ఆర్టీసీ కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల అదనపు బలగాలు ట్యాంక్‌బండ్ చేరుకుంటున్నాయి.
ట్యాంక్‌బండ్ పైకి చొచ్చుకొచ్చిన ఆర్టీసీ కార్మికులు.. ఉద్రిక్తత... - tsrtc strike Breaking
ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్ వైపు కార్మికులు, విపక్ష నేతలు పరుగులు తీశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికి బారికేడ్లను తోసుకుని ఫ్లైఓవర్ కిందకు దూసుకొచ్చారు. నలువైపుల నుంచి ఆందోళనకారులు చొచ్చుకురావటం వల్ల... వారిని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత
ఆర్టీసీ కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. లిబర్టీ, ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే ఉన్న అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత
ఇదీ చదవండి: ఛలో ట్యాంక్‌బండ్: ఓయూలో విద్యార్థి నేతల అరెస్టు
Last Updated : Nov 9, 2019, 2:58 PM IST