తెలంగాణ

telangana

ETV Bharat / city

'చలో విజయవాడ'లో ఉద్రిక్తత.. ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికుల అరెస్టులు.. - chalo Vijayawada updates

chalo Vijayawada : ఏపీలో మున్సిపల్ కార్మికుల "చలో విజయవాడ" కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

tension-in-the-chalo-vijayawada-program-among-municipal-workers-in-ap
tension-in-the-chalo-vijayawada-program-among-municipal-workers-in-ap

By

Published : Mar 11, 2022, 5:24 PM IST

chalo Vijayawada : ఏపీలోని విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కార్మికులను అడ్డుకున్నారు. సమస్యల కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులతో మున్సిపల్‌ కార్మికులు వాగ్వాదానికి దిగారు. అక్రమ అరెస్ట్‌లతో పోరాటం ఆపలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడికక్కడే అరెస్టులు..
విజయవాడ ధర్నాచౌక్‌కు వస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి ఆటో, కాలినడకన ధర్నాచౌక్ కు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో వారిని నున్న, భవానీపురం, వన్ టౌన్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం పీఆర్సీని తమకు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సమస్యలను నెరవేర్చకపోతే నిరహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

స్టేషన్‌ ముందు నిరసన..
కృష్ణాజిల్లా నందిగామలోనూ మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్లకుండా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్‌ ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

రాత్రి నుంచే..
ఒంగోలులో రాత్రి నుంచే మున్సిపల్ కార్మికుల అరెస్టులు కొనసాగాయి. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో, ఉదయం మస్తర్లు వేసే సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో కార్మికులు ఆందోళన చేశారు. విధులకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'చలో విజయవాడ'లో ఉద్రిక్తత.. ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికుల అరెస్టులు..

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details