ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పగిడిరాయికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్కు బాలికను తీసుకువచ్చారు. బాలికను చూపించాలని పెద్దఎత్తున పోలీస్ స్టేషన్కు బంధువులు వెళ్లారు.
ఎస్సై దురుసు ప్రవర్తన.. కారంపొడి చల్లిన మహిళలు - కర్నూలు క్రైమ్ న్యూస్
ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాలిక అదృశ్యమైన కేసులో ఎస్సైపై మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్కు బాలికను తీసుకువచ్చారు.
![ఎస్సై దురుసు ప్రవర్తన.. కారంపొడి చల్లిన మహిళలు ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11889596-109-11889596-1621927527053.jpg)
ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత
ఎస్సై సురేశ్ తమతో దురుసుగా ప్రవర్తించినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అనంతరం పగిడిరాయికి వెళ్లిన ఎస్సైపై మహిళలు కారంపొడి చల్లారు. ఈ ఘటనతో అర్ధరాత్రి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.
ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత
ఇదీ చదవండి:ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ
Last Updated : May 25, 2021, 2:30 PM IST