Tension in Amaravati farmers Padayatra: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని అనుకూల, వ్యతిరేక నినాదాలతో పశ్చిమగోదావరి జిల్లా ఐతంపూడిలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుగొండ వాసవీమాత ఆలయం నుంచి 30వ రోజు పాదయాత్ర ప్రారంభించిన అమరావతి రైతులు.. ఆచంట నియోజకవర్గం నుంచి తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో పాదయాత్ర ఐతంపూడి వద్దకు చేరుకోగానే.. పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు, నల్లజెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు. రోడ్డకు ఒకవైపున వరుసగా నిల్చుని రైతులను అడ్డుకోబోయేందుకు వైకాపా శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు.
అసెంబ్లీ రద్దు చేసి మూడు రాజధానుల అజెండాతో సీఎం జగన్ ఎన్నికలకు రావాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. రైతులతో కలిసి మహా పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ప్రజాప్రతినిధులు రైతులపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపలేరన్నారు.