తెలంగాణ

telangana

ETV Bharat / city

హిందూపురం ప్రెస్​ క్లబ్ వద్ద ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే..?

Tension at Hindupuram Press Club: ఏపీ హిందూపురం ప్రెస్​క్లబ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా కార్యకర్తలు, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు పార్టీల నాయకులను అక్కడనుంచి పంపించి వేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

హిందూపురం
హిందూపురం

By

Published : Sep 28, 2022, 7:12 PM IST

Tension at Hindupuram Press Club: ఆంధ్రప్రదేశ్​ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్​క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న చిలమత్తూరు మండలంలో వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక ప్రెస్​క్లబ్​లో తెదేపా శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం అనంతరం తెదేపా నాయకులు బయటికి వెళ్లే సమయంలో మూకుమ్మడిగా వచ్చిన వైకాపా కార్యకర్తలు వారిని అడ్డుకొని నినాదాలు చేశారు.

వైకాపా కార్యకర్తలను ప్రతిఘటిస్తూ తెదేపా శ్రేణులు సైతం జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని అక్కడనుంచి పంపించి వేశారు. వైకాపా గూండాలను వెంటనే అరెస్టు చేయాలంటూ తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు నెలల కాలంలోనే వైకాపా కార్యకర్తలు ప్రెస్​క్లబ్​లో దాడులకు ప్రయత్నించడం ఇది రెండోసారి అని వారు ఆరోపించారు.

ఈ ఘటన సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ కార్యదర్శి రామాంజనమ్మ పట్ల వైకాపా కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆమె తనను కులం పేరుతో దూషించారంటూ వన్​టౌన్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రామాంజనమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైకాపా కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని.. లేకపోతే వారి నుంచి తమకు ప్రాణం ఉందంటూ సీఐకి తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేశారు.

హిందూపురం ప్రెస్​ క్లబ్ వద్ద ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే..?

ఇవీ చదవండి:తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

PFI బ్యాన్​.. భాజపా, మిత్రపక్షాలు హర్షం.. RSS నిషేధానికి విపక్షాల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details