విశాఖ జిల్లా సీతమ్మధారలోని తెదేపా మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సబ్బంహరి ఇంటి ప్రహారీ గోడను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడం అని అధికారులు అంటున్నారు.
విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత - మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ గోడ కూల్చివేత
తెదేపా నేత, మాజీ ఎంపీ సబ్బం హరి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖ సీతమ్మధారలోని సబ్బంహరి ప్రహరీగోడను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై తనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని సబ్బం హరి నిరసనకు దిగారు.
sabbam hari
ముందుగా సమాచారం ఇవ్వకుండా తొలగింపుపై సబ్బంహరి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వలేదని అన్నారు. గోడ కూల్చివేతపై సమాధానం ఇచ్చేందుకు జీవీఎంసీ సిబ్బంది నిరాకరించారు.
ఇదీ చదవండి:దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం