ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు78 ఏళ్లు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉదయం మరణించారు. రవీంద్రనాథ్ చౌదరి 1994లో తెదేపా తరపున పోటీ చేసి.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుపై గెలుపొందారు. అంతకు ముందు రెండు పర్యాయాలు తెనాలి మున్సిపల్ ఛైర్మన్ గానూ పనిచేశారు.
తెనాలి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ చౌదరి మృతి - టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మృతి
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి ఉదయం కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన ఆయన.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో అదో పెద్ద సంచలన విజయం.
తెనాలి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ చౌదరి మృతి
1982-86 మధ్య కాలంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి... కౌన్సిలర్ గా గెలిచి, మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 1987లో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా గెలిచి రెండోసారి మున్సిపల్ ఛైర్మన్ పదవి చేపట్టారు.
తర్వాత తెలుగుదేశం విధానాలపై ఆకర్షితులై సైకిల్ ఎక్కారు. 1994 ఎన్నికల్లో తెదేపా తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లోనే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ర భాస్కరరావుపై సంచలన విజయం సాధించారు. ఇటీవలి కాలంలో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.