తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రమాణస్వీకారం చేసిన హైకోర్టు నూతన న్యాయమూర్తులు - తెలంగాణ హైకోర్టు న్యూస్

Telangana HC New Judges Swearing Ceremony : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉన్నత న్యాయస్థానం సీజే సతీశ్ చంద్ర వీరితో ప్రమాణం చేయించారు. కొత్తగా నియామకమైన వారితో కలిపి హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి చేరింది.

Telangana HC New Judges Swearing Ceremony
Telangana HC New Judges Swearing Ceremony

By

Published : Mar 24, 2022, 10:35 AM IST

Telangana HC Judges Swearing Ceremony : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పదిమంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌ చంద్ర శర్మ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు.. న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి.. మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేశారు. వీరిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Telangana HC judges took oath : న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, శ్రావణ్‌ కుమార్‌ వెంకట్‌ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, నాగార్జున్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో.. ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. కొత్త న్యాయమూర్తుల నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.

ABOUT THE AUTHOR

...view details