తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలంలో వరద ఉధృతి... 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరికొన్ని రోజులు జలాశయానికి వరద తాకిడి కొనసాగనుందని అధికారులు తెలిపారు.

ten gates lifted in srisailam reservoir to release flood water
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

By

Published : Oct 20, 2020, 3:51 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి అధికారులు వరద నిటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,01,818 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,96,497 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 883.80 అడుగులు కాగా... నీటి నిల్వ 208.72 టీఎంసీలకు చేరింది.

కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26 వేల 677 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, జూరాలకు వరద తాకిడి కొనసాగుతోంది. మరికొన్నిరోజులపాటు శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

ABOUT THE AUTHOR

...view details