తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. 10గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

ten-gates-lifted-at-srisailam-dam-as-inflow-continues
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. 10గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Sep 18, 2020, 11:59 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,47,457 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ఈ క్రమంలో జలాశయం పది గేట్లను ఎత్తి.... నాగార్జునసాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఔట్ ఫ్లో 3,13,787 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 884.20 అడుగులకు చేరుకోగా... నీటి నిల్వ 210.09గా నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details