ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో రెండు వందల మందికి.. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఒక్క రోజే 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, డీఎస్పీ నాగరాజు ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంకా సుమారు 100 మంది ఫలితాలు రావాల్సి ఉండగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
నవాబుపేటలో విషాదం: