తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..! - ts rtc strike updates

" 41 రోజుల ఆర్టీసీ సమ్మెలో విలీనం అనే అంశానికి తెరపడింది. దీనిపై ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గారు.. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మిగిలిన డిమాండ్ల పై చర్చలకు పిలుస్తుందా..? లేదా...? అనేది ఆసక్తికరంగా మారింది"

ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

By

Published : Nov 15, 2019, 4:59 AM IST

సమ్మె.. కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, అఖిలపక్ష నేతలు భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్​ ఈయూ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కోకన్వీనర్‌ రాజిరెడ్డితో పాటు తెజస అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ వీహెచ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, భాజపా నేత మోహన్‌రెడ్డి, సీపీఐ నేతలు పల్లా వెంకట్‌రెడ్డి, సుధాకర్‌ తదితరులు హాజరయ్యారు.

ఆర్టీసీ జేఏసీ - ఉద్యమ కార్యాచరణ

  1. 15వ తేది (ఇవాళ) - రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు
  2. 16వ తేదీ - హైదరాబాద్‌లో నలుగురు జేఏసీ నేతల దీక్ష
  3. 17, 18వ తేదీ - జిల్లాలోని డిపోల వద్ద కార్మికుల సామూహిక దీక్ష
  4. 19వ తేదీ హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌

ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత: ఆర్టీసీ ఐకాస

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 23 మంది కార్మికులు బలవన్మరణానికి పాల్పడితే... ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన కూడా చేసే పరిస్థితి లేదని ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

మేదావి మౌనం దేశానికి ఎంతో నష్టం.. నోరు విప్పండి.. !

తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదని, ఆర్టీసీ నేతలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా సమ్మెపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

ఇదీ చదవండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details