భాగ్యనగరంలో ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గినా.. ఉక్కపోత మాత్రం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం రోజంతా ఈదురుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో వీటి వేగం గంటకు 15 నుంచి 40 కిలోమీటర్ల వరకు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
వేడి తీవ్రత తగ్గినా.. ఉక్కపోత పెరిగింది - Hyderabad rains
హైదరాబాద్‌లో ఎండల తీవ్రత ప్రస్తుతానికి తగ్గినా.. ఉక్కపోత మాత్రం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం రోజున పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి.

శనివారం హైదరాబాద్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలుగా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పడిపోయాయి. ఈదురుగాలులు, అక్కడక్కడ చిరు జల్లులతో వాతావరణం చల్లబడినా... రాత్రిపూట మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఎక్కువే నమోదవుతున్నాయి. ఆదివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 నుంచి 27 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(టీఎస్‌డీపీఎస్) తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే వీలుందని వెల్లడించింది.
శనివారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..
- ఇదీ చదవండి :లాక్డౌన్ వేళ ఆగమ్యగోచరంగా టమాట రైతుల పరిస్థితి