ఉష్ణోగ్రత పడిపోతోంది.. వస్తూనే చలి వణికిస్తోంది.. - Temperature drop in Hyderabad
చలి తీవ్రత మొదలైంది. ఒక్కరోజులోనే భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోయాయి. ఆదివారం రాత్రి 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతకు పడిపోయింది. సాయంత్రం 5 గంటలకే చలి మొదలై రాత్రికి తీవ్రంగా మారుతోంది.

హైదరాబాద్లో ఉష్ణోగ్రత పడిపోతోంది
భాగ్యనగరంలో చలి తీవ్రత మొదలైంది. ఉష్ణోగ్రతలు పడిపోయి సాయంత్రం 5 గంటలకే చలి తీవ్రంగా మారుతోంది. తెల్లవారుజామున నగరమంతా మంచు దుప్పటి కప్పుకుంటుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పగలు మాత్రం ఎండ తీవ్రత ఉంటోంది. సాధారణ స్థాయికంటే 1.8 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.
- ఇదీ చూడండిఆదుర్దా.. ఆందోళన.. భయం.. మితిమీరితే?