తెలంగాణ

telangana

ETV Bharat / city

మహానాడు వేదిక కోసం స్థల పరిశీలన చేసిన తెదేపా నేతలు - ap latest news

TDP Mahanadu at Prakasam District: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది ఏపీలోని ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మహానాడు వేదిక కోసం శనివారం స్థల పరిశీలన చేశారు. తాజాగా గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు.

TDP Mahanadu
TDP Mahanadu

By

Published : May 15, 2022, 10:06 AM IST

TDP Mahanadu at Prakasam District: ఏపీలోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడు వేదిక కోసం ఆ పార్టీ నేతలు స్థల పరిశీలన చేశారు. ఒంగోలు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సభ పెట్టాలని తొలుత నేతలు భావించారు. తాజాగా మద్దిపాడు మండలం గుళ్లాపల్లిలో వేదిక కోసం స్థలాన్ని పరిశీలించారు. గ్రోత్ సెంటర్​లోని మహి ఆగ్రోస్ పరిశ్రమలో భారీ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

వర్షం పడితే బహిరంగ ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తుతాయనే.. ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. మహానాడు నిర్వహణకు పదహారు కమిటీలు ఏర్పాటయ్యాయని.. ఈ మేరకు వీరంతా త్వరలో వేదిక ప్రాంతంలో పనులు ప్రారంభిస్తారని నేతలు వెల్లడించారు. ఈనెల 27న 10వేల మందితో ప్రతినిధుల సభ.. 28న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారని నేతలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details