తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 11AM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telugu top ten news
Telugu top ten news

By

Published : Dec 30, 2021, 11:00 AM IST

  • 'హరీశ్​రావు ప్రజల మనిషని మరోసారి రుజువైంది'

Sekhar Kammula : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావుకు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

  • సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు!

Bus Charges Hike in Telangana : తెలంగాణ ప్రజలపై మరో భారం పడనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదని తేలిపోయింది. ఇక ఆర్టీసీ ఛార్జీల పెంపూ తప్పదని తేటతెల్లమవుతోంది. సంక్రాంతి తర్వాత ఛార్జీల పెంపుపై ప్రకటన జారీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

  • తగ్గిన బంగారం ధర..

Gold Price Today: దేశంలో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • తప్ప తాగుతున్నారు..

Murders Due to Alcohol : మద్యం మత్తు విచక్షణను చంపేసి, క్రూరత్వాన్ని, శత్రుత్వాన్ని పెంచేస్తోంది. వెరసి మైకం కొందరిలో నేర ప్రవృత్తిని పెంచుతోంది. మామూలుగా ఉన్నప్పుడు మంచివాళ్లుగా ఉండే కొందరు చుక్కపడగానే ‘తేనె పూసిన కత్తుల్లా’ మారుతున్నారు. అత్యాచారాలు, హత్యలు సహా పలు నేరాలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిలో మూడొంతుల మంది మద్యం తాగినవారే ఉంటున్నారని పోలీసులే చెబుతున్నారు.

  • ఐదుగురు సంతానమున్నా..

son Abandoned mother : నవమాసాలు మోసి కన్న తల్లి ఆ పిల్లలకు భారమైంది. కంటికి రెప్పలా కనిపెంచిన ఆ మాతృమూర్తితో వారికి బంధం తెగిపోయింది. ఎండనక వాననక కష్టపడి ఏ సమస్య రాకుండా వాళ్లను చూసుకున్న ఆ అమ్మకు నేడు నిలువ నీడలేకుండా పోయింది. కాటికికాళ్లు చాపిన ఆ మాతృమూర్తిపై ఆమె పిల్లలు కాస్త కనికరం చూపలేకపోయారు. చివరకు ఆ తల్లిని అనాథలా రోడ్డుపాలు చేశారు.

  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

India covid cases: దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 13,154‬ కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు. బుధవారం 63,91,282 మందికి టీకాలు అందించారు.

  • ఒమిక్రాన్​తో కరోనా కేసుల సునామీ..

WHO warning Omicron: ఒమిక్రాన్ వేరియంట్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.

  • పదో తరగతి బాలుడితో టీచర్​ ప్రేమాయణం..

Teacher and student loves: పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన ఓ ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలుడిని వేధించిన టీచర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడు, అరియలూర్​ జిల్లాలో జరిగింది.

  • ఎన్టీఆర్​ నాలో సగభాగం..

RRR Pre Release Event: ఎన్టీఆర్​ తనలో సగభాగమని చెప్పారు మెగా పవర్​స్టార్ రామ్ చరణ్. అతడు లేనిదే 'ఆర్ఆర్​ఆర్'​ లేదని కేరళలో ప్రీ రిలీజ్​ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. చరణ్​ కూడా తనలో సగభాగమని, హృదయం ఎక్కడుందో చరణ్ అక్కడే ఉంటాడని చెప్పారు తారక్.

  • రాస్​ టేలర్ గుడ్​బై..

Ross Taylor Retirement: అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు న్యూజిలాండ్ బ్యాటర్​ రాస్ టేలర్. వచ్చే ఏడాది వేసవి వరకు సొంతగడ్డపై రెండు టెస్టులు, ఆరు వన్డేలు ఆడి అన్నిఫార్మాట్లకు దూరం కానున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details