తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @9AM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS TODAY, telangana news
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​

By

Published : Feb 6, 2022, 8:59 AM IST

  • రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చలి..

రాష్ట్రంలో చలిపులి మళ్లీ పంజా విసురుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లాలోని అర్లి(టి)లో 6, జిల్లా కేంద్రంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • గంజాయి సాగు.. రైతుబంధు బంద్​

గంజాయి సాగు చేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన ఓ రైతుకు అధికారులు షాక్ ఇచ్చారు. రైతుబంధు పథకం అర్హుల జాబితా నుంచి అతని పేరు తొలగించారు.

  • తెరాస, భాజపా ట్విటర్​ వార్​..

ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో సీఎం కేసీఆర్​ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. జ్వరం వల్ల హాజరు కాలేకపోయారన్న తెరాస.. ప్రైవేటు కార్యక్రమాల్లో ప్రధానికి స్వాగతం పలకాల్సిన అవసరం లేదని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలే చెబుతున్నాయని ట్వీట్ చేసింది. మరోవైపు మంత్రులు, తెరాస నేతలు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్‌తో.. 20 వేలకుపైగా ట్వీట్లు చేసి ట్రెండింగ్ సృష్టించారు.

  • ఊళ్లో.. ఇళ్లు కట్టేదెలా..?

గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌కు ఎల్​ఆర్​ఎస్​ లేదంటూ పంచాయతీ అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 10.83 లక్షల దరఖాస్తులు రాగా.. వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • మేడారం జాతరకు సాంకేతిక హంగులు..

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భక్తులు అమ్మవార్లకు డబ్బును కానుకగా సమర్పించడానికి ఈ-హుండీని కూడా ఏర్పాటు చేశారు.

  • యూపీ తొలిదశ ఎన్నికల్లో 15 మంది నిరక్షరాస్యులు

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల మొదటి దశ బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 15 మంది నిరక్ష్యరాస్యులేనని అసోషియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ తెలిపింది. అంతేగాకుండా మరో 125 మంది విద్యార్హత కేవలం 8వ తరగతి అంతకంటే తక్కువ అని స్పష్టం చేసింది.

  • 50% సీట్లలో ప్రభుత్వ కాలేజీలతో సమానంగా ఫీజులు

ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్​ వర్సిటీల్లో రుసుములపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది జాతీయ వైద్య కమిషన్​. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఫీజుల స్థాయిలో ఉండాలని స్పష్టం చేసింది. మొత్తంమీద సంబంధిత విద్యా సంస్థకు అనుమతించిన సీట్ల సంఖ్యలో గరిష్ఠంగా 50 శాతానికి దీన్ని పరిమితం చేయాలని సూచించింది.

  • 'ఆయనతో సంబంధంపై పుస్తకం రాసేందుకు సిద్ధం'

కేరళ బంగారం కేసు నిందితురాలు స్వప్న సురేశ్​ తనను మోసం చేసిందంటూ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్​ ఇటీవల తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను స్వప్న తోసిపుచ్చింది. శివశంకర్​ను తాను మోసం చేయలేదని.. ఆయన ఈ ఇలాంటి ఆరోపణలు చేస్తారని అనుకోలేదని పేర్కొంది.

  • కృత్రిమ మంచులోనే వింటర్​ ఒలింపిక్స్​..

బీజింగ్​లో గడ్డకట్టే చలిలో వివిధ క్రీడల్లో పోటీ పడుతున్నారు అథ్లెట్లు. అయితే ఈ శీతాకాల ఒలింపిక్స్​ పూర్తిగా కృత్రిమ మంచుపై జరుగుతున్నాయని తెలుసా? దానిని ఎలా తయారు చేస్తారంటే..

  • 'పోస్టర్​పై నా పేరు వేయండి: హీరో రవితేజ'

'రాక్షసన్​' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విష్ణు విశాల్​ చేస్తున్న కొత్త సినిమా 'ఎఫ్​.ఐ.ఆర్'​. దానికి ఆయనే నిర్మాత. ఈ సినిమాను తెలుగులో మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 'ఖిలాడి'కి పోటీగా ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11నే విడుదల కానుండటం విశేషం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు విష్ణు విశాల్.

ABOUT THE AUTHOR

...view details